ఫిదా బ్యూటీ ఆటోవాలా

277
ఫిదా`బ్యూటీ సాయి ప‌ల్ల‌వి కెరీర్ ఆరంభం నుంచి సెలక్టివ్ గా సినిమాలో చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ్లామ‌ర్ డోస్ లేకుండా కేవ‌లం పాత్ర ప్రాముఖ్య‌త‌ను బ‌ట్టే క‌మిట్ అవుతోంది. నేచుర‌ల్ పెర్పామెన్స్ తో క‌ట్టిప‌డేస్తోంది.  అందుకే అన‌తి కాలంలోనే త‌మిళ్, తెలుగులో స్టార్ హీరోయిన్  అయింది.
ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ స‌ర‌స‌న  `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` తో పాటు, కోలీవుడ్ లో సూర్య స‌ర‌స‌న `ఎన్జీకే` లో న‌టిస్తోంది. ఫిదా లో మాస్ క్యారెక్ట‌ర్ తో మెప్పించిన అమ్మ‌డు మ‌రోసారి ఎన్జీకే లో అంత‌కు మించిన మాస్ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో సొగ‌స‌రి ఆటోవాలా గా క‌నిపించ‌నుంది.
తాజాగా ఆ పాత్ర లుక్  రివీల్ అయింది. ఆటో డ్రైవ‌ర్ డ్రెస్ ధ‌రించి మ‌రింత మాస్ పిల్ల‌గా క‌నిపిస్తోంది. మాస్ స్టెప్ ల‌తో మెలితిప్పేయ‌డం ఖాయ‌మ‌ని  తెలుస్తోంది. బొక్క‌లిరుగుతాయ్..బ‌ద్మాష్ అంటూ `ఫిదా` లో తెలంగాణ యాస లో  ఏపీ యువ‌త‌లో చిచ్చు రాజేసిన అమ్మ‌డు  ఈసారి తంబీల కోసం ఎలాంటి స్లాంగ్ లో మెప్పించ‌నుందా చూద్దాం. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈనెలాఖ‌రుక‌ల్లా షూటింగ్ పూర్త‌వుతుంది. తెలుగులో `నంద‌గోపాల‌కృష్ణ` టైటిల్ తో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.