ఇందిరాగాంధీ బయోపిక్ లో త్రిష..?

52

డిజిటల్ పెయింటింగ్ లా ఉన్న ఈ పోస్టర్ ను వికటన్ అనే పాపులర్ తమిళ మ్యాగజైన్ ప్రచురించారట. ఇందిరాగాంధి ట్రేడ్ మార్క్ అయిన షార్ట్ హెయిర్ స్టైల్.. సాల్ట్ & పెప్పర్ లుక్ తో పాటుగా చీరలో త్రిష అచ్చుగుద్దినట్టుగా ఇందిరాగాంధి లాగానే ఉంది. మరి ఆ మ్యాగజైన్ వారు ఎందుకు ఇలాంటి పోస్టర్ ను ప్రచురించారో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం త్రిష త్వరలో ఇందిరాగాంధీ బయోపిక్ లో నటిస్తోంది అనీ ప్రచారం మొదలైంది.

ఇదిలా ఉంటే తమిళ నాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ లో త్రిష నటిస్తోందన్న రూమర్లు కూడా చాలా రోజుల నుండి వినిపిస్తున్నాయి. కానీ త్రిష మాత్రం ఈ బయోపిక్ విషయంలో స్పందించలేదు