100 కోట్ల క్ల‌బ్ లో స‌ర్కార్

148

త‌మిళ హీరో విజ‌య్ క‌థానాయ‌కుడిగా మురగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స‌ర్కార్` రికార్డు సృష్టించింది. మంగ‌ళ‌వారం రిలీజైన సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది. తెలుగులో ఫ‌లితం ఆశాజ‌న‌కంగా లేక‌పోయినా మాతృభాష‌లో, విదేశాల్లో మాత్రం స‌ర్కార్ దూకుడు కొన‌సాగుతోంది. ఈ వసూళ్ల‌తో విజ‌య్` బాహుబ‌లి-2` సినిమా తొలి రోజు వ‌సూళ్ల‌ను బీట్ చేసిన‌ట్లు అయింది.

రెండు రోజుల్లోనే 100 కోట్లు వ‌సూళ్లు సాధించిన ఏకైక త‌మిళ చిత్రంగా చ‌రిత్ర పుట్ట‌ల్లోకి ఎక్కింది. మ‌రిన్ని రికార్డులు నెల‌కొల్ప‌డం ఖాయ‌మంటూ అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ సంబ‌రాలు షురూ చేసారు. గ‌తలో ఇదే కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `క‌త్తి` కూడా 100 కోట్ల వ‌సూళ్ల‌ను సునాయాసంగా అధిగ‌మించింది.

అప్పుడు త‌మిళ ఇండ‌స్ర్టీలో ఓ హాట్ న్యూస్. క‌మల్ హాస‌న్, ర‌జ‌నీకాంత్ లాంటి స్టార్ హీరోల‌కే సాధ్యం కానిది విజ‌య్ సాధించాడ‌ని ప్ర‌త్యేక క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అంత‌కు ముందు తెర‌కెక్కిన `తుపాకీ` కూడా భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. ఆ సినిమా తెలుగునాట పెద్ద స‌క్సెస్ అయింది. అయితే స‌ర్కార్ మాత్రం ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ను, క్రిటిక్స్ ను నిరాశ‌ప‌రిచింది. కొంత మంది టాలీవుడ్ సెల‌బ్రిటీలు స‌ర్కార్ ను ఆకాశానికి ఎత్తేసారు. అందులో మ‌హేష్ బాబు ముందున్నాడు. స‌ర్కార్ సినిమా చూసి విజ‌య్- మురుగ‌దాస్ ల ప‌నితనాన్ని కొనియాడాడు.