టీజ‌ర్ టాక్: రామ్ కొణిదెల ఊర‌మాస్ లెక్క‌!

71

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రామ్ చ‌ర‌ణ్ `విన‌య విధేయ రామ‌` టీజ‌ర్ వ‌చ్చేసింది. అభిమానుల అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ప‌క్కా మాస్ సినిమా అని టీజ‌ర్ చెప్ప‌క‌నే చెబుతోంది.  చ‌ర‌ణ్ మాస్ ఇమేజ్..బోయ‌పాటి మాస్ శైలి టీజర్ ను మ‌రింత పీక్స్ కు తీసుకెళ్లింది. అన్న‌య్యా వీడిని చంపేయాలా? భ‌య‌పెట్టాలా? భ‌య‌పెట్టాలంటే ప‌దినిమిషాలు. చంపేయాలంటే పావుగంట‌..ఏదైనా ఒకే చెల‌క్ట్ చేసుకో అంటూ రామ్ చ‌ర‌ణ్ స్టైలిష్ గా ప‌లికిన సంభాష‌ణ‌లు అదిరిపోయాయి. మ‌రో స‌న్నివేశంలో `రేయ్ పందెం ప‌ర‌శురాం అయితే ఏంట్రా? ఇక్క‌డ రామ్..రామ్..రామ కొణిదెల` అంటూ బ‌ల్ల‌గుద్దీ మ‌రీ చెబుతాడు చెర్రీ. ఆ డైలాగ్ టీజ‌ర్ కే హైలైట్ గా నిలించింది.

ఇక ఫుల్ ర‌న్ లో రామ్ చ‌ర‌ణ్ విశ్వ‌రూపం మూముల‌గా ఉండ‌ద‌ని తెలుస్తోంది. బోయ‌పాటి శైలి యాక్ష‌న్ స‌న్నివేశాలు..రామ్ క‌త్తి ప‌ట్టే స‌న్నివేశాలు పీక్స్ లో ఉంటాయ‌నే తెలుస్తోంది. అయితే టీజ‌ర్  లో  కొత్త‌ద‌నం ఏమాత్రం క‌నిపించ‌లేదు. బోయ‌పాటి గ‌త సినిమా టీజ‌ర్లు ఎలా ఉంటాయో అలాగే ఉంది. దీన్నిబ‌ట్టి  క‌థ స్వ‌రూపం ఎలా ఉంటుందో? ఊహించ‌వ‌చ్చు. ఇటీవ‌లే `విన‌య విధేయ రామ` చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.  ఇందులో చెర్రీ స‌ర‌స‌న కియారా అద్వాణి న‌టిస్తోంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. దాన‌య్య భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.